Politics2nd Apr 10:59 AMSunil Byrisetty1 min read
అవసరం లేకున్నా సిజేరియన్లు.. వైద్య శాఖ మంత్రి సంచలనం
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తన శాఖలోని లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న జబ్బులతో ఆసుపత్రికి వెళ్లినా టెస్టుల పేరుతో జేబులు ఖాళీ చేస్తున్నారని అన్నారు. రోగులను వైద్యు
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తన శాఖలోని లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న జబ్బులతో ఆసుపత్రికి వెళ్లినా టెస్టుల పేరుతో జేబులు ఖాళీ చేస్తున్నారని అన్నారు.
రోగులను వైద్యులు మానవతా దృష్టితో చూడాలని అన్నారు.
అవసరం లేకపోయినా స్కానింగ్‌లు, ఎక్స్ రేలు రాస్తున్నారని విమర్శించారు.
సాధారణ ప్రసవాలు చేయకుండా సిజేరియన్లు చేస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా అలాగే ఉన్నారని ఎక్కువ టెస్టులు రాస్తేనే వైద్యులు బాగా చేశారనే అపోహలో ఉంటున్నారని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.
రోగులను వైద్యులు చిరునవ్వుతో పలకరించాలని అన్నారు.
ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా వైద్యరంగంలోని లోపాలను ఎత్తి చూపారు.