Education23rd Apr 12:22 PMSunil Byrisetty1 min read
పది ఫలితాలొచ్చేశాయ్.. 600కి 600 తెచ్చుకున్న విద్యార్థిని!
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో కాకినాడకు చెందిన ఓ విద్యార్థిని అరుదైన రికార్డు సాధించింది. కాకినాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో కాకినాడకు చెందిన ఓ విద్యార్థిని అరుదైన రికార్డు సాధించింది.
కాకినాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న యల్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించింది.
గ్రూప్ సబ్జెక్టుల్లో నూటికి నూరు శాతం మార్కులు ఎంతోమందికి వస్తాయి కానీ లాంగ్వేజెస్‌లో సైతం వందకు వంద రావడం తొలిసారి కావడం గమనార్హం.
ఈ అరుదైన ఘనత సాధించిన నేహాంజనిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
అలాగే పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని పావని చంద్రిక 600కి 598 మార్కులు సాధించింది.
ప్రభుత్వ పాఠశాలలో చదివి 598 మార్కులతో మెరిసిన పావని ఆదర్శంగా నిలిచింది.