Politics11th Jun 01:03 PMSunil Byrisetty1 min read
పొదిలిలో జగన్‍కు నిరసన సెగ
ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్‍కు నిరసన సెగ ఎదురైంది. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన జగన్ రైతులతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో నల్ల బెలూన్లు, ప్లకార
ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్‍కు నిరసన సెగ ఎదురైంది. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన జగన్ రైతులతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో నల్ల బెలూన్లు, ప్లకార్డులతో మహిళల నిరసనకు దిగారు. జగన్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి డిబేట్‍లో మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు నిరసనకారులపై రాళ్లు, చెప్పులు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడిలో కానిస్టేబుల్‍కు గాయాలైనట్లు సమాచారం.