News23rd Apr 05:39 PMSunil Byrisetty1 min read
ఉగ్రదాడిని నిరసిస్తూ వైసీపీ క్యాండిల్ ర్యాలీలు
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైయస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించనుంది. పార్టీ అధ్యక్షుడు వైయస్
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైయస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించనుంది.
పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్నారు.
దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ పార్టీ శ్రేణులు క్యాండిల్‌ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు.
వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు.