Crime29th Mar 08:55 AMSunil Byrisetty1 min read
పిల్లల పేరుతో పెద్ద దోపిడీ.. వైసీపీ చేసిందిదే!
గత వైసీపీ హయాంలో వరుస అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రతి శాఖలో దోపిడీకి పాల్పడిందని చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించిన ప్రతి ఒక్క దానిలో కుంభకోణా
గత వైసీపీ హయాంలో వరుస అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది.
ప్రతి శాఖలో దోపిడీకి పాల్పడిందని చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించిన ప్రతి ఒక్క దానిలో కుంభకోణానికి తెర తీసిందని విమర్శిస్తోంది.
గత ప్రభుత్వంలో జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పథకాల్లో అంతులేని నిధుల దుర్వినియోగం ఉందంటూ ఆరోపిస్తోంది. చిన్న పిల్లలకు స్టూడెంట్ కిట్ పేరిట ఇచ్చిన బ్యాగులు, బెల్టులు మొదలుకుని, విద్యార్థుల భోజనంలో వడ్డించిన కోడి గుడ్ల వరకు సుమారు రూ.1000 కోట్లు దోపిడీ చేసారు వైసీపీ పెద్దలు అని చెబుతోంది.
ఈ ఏడాది విద్యార్థులకు ఇచ్చేందుకు స్టూడెంట్ కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేయగా ఈ స్కాం బయటపడటంతో ప్రభుత్వం స్కామ్ పై విచారణ చేయిస్తోంది.