Politics13th Oct 05:10 PMSunil Byrisetty1 min read

బీసీల రిజర్వేషన్లకు వైసీపీ కోత.. 40శాతంతో టీడీపీ భరోసా

బీసీల రిజర్వేషన్లకు వైసీపీ ప్రభుత్వం కోత విధిస్తే, కూటమి ప్రభుత్వం 40 శాతానికి పైగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ బీసీలకు భరోసా ఇస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోన

బీసీల రిజర్వేషన్లకు వైసీపీ కోత.. 40శాతంతో టీడీపీ భరోసా
బీసీల రిజర్వేషన్లకు వైసీపీ ప్రభుత్వం కోత విధిస్తే, కూటమి ప్రభుత్వం 40 శాతానికి పైగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ బీసీలకు భరోసా ఇస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పునాదులు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే రాష్ట్రంలో బలహీన వర్గాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పారు. గత గొడ్డలి ప్రభుత్వ పాలనలో బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వంలో చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాల ఫలితంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 40 శాతానికి పైగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుందని తెలిపారు. ఎన్టీఆర్ తొలుత 20 శాతం రిజర్వేషన్లు కల్పించగా, చంద్రబాబు వాటిని 34 శాతానికి పెంచారని గుర్తుచేశారు.
Scroll for the next article