Politics2nd Nov 11:13 AMSunil Byrisetty1 min read

మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్!

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఉదయం అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ తో పాటు ఆయన పీఏను కూడా అరెస్టు చేశారు. న

మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్!
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఉదయం అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ తో పాటు ఆయన పీఏను కూడా అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో పోలీసులు తీగ లాగడంతో అసలు విషయం బయటపడింది. తనను బలిపశువును చేయడంతో అద్దేపల్లి జనార్ధన రావు మొత్తం విషయం బయట పెట్టారు. జోగి రమేషే కుట్రదారు అని తేల్చారు. ఇటివల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మొత్తం వివరాలు రాబట్టారు. సాక్ష్యాలను కూడా సేకరించారు. అద్దేపల్లి ఎవరో తనకు తెలియదని.. జోగి రమేష్ బుకాయించారు. కానీ ఆయన బాగా పరిచయస్తుడని అన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ మద్యం కేసులో దొరికిపోవడంతో.. జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు.
Andhra Pradesh
Ibrahimpatnam
Jogi Ramesh
Arrest
Fake Liquor Case
Former Minister
Police Investigation
Addepalli Janardhan Rao
జోగి రమేష్ అరెస్ట్
నకిలీ మద్యం కేసు
Scroll for the next article