Politics2nd May 01:13 PMSunil Byrisetty1 min read
అనుబంద విభాగాల కమిటీలపై వైసీపీ ఫోకస్
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు, క్లస్టర్ అధ్యక్షులతో
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.
అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు, క్లస్టర్ అధ్యక్షులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి సమావేశం నిర్వహించారు.
సమావేశంలో భూమన మాట్లాడుతూ త్వరితగతిన అనుబంధ విభాగ కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు.
వారికి పలు సూచనలు చేశారు.
ఈ సమావేశానికి అతిధిగా పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఇబ్బందులను అధిగమించి కూటమి కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.