Politics25th May 11:37 AMSunil Byrisetty1 min read
మహానాడు వాయిదాపై వైసీపీ డిమాండ్!
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కడపలో జరగనున్న మహానాడు సభను వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి కోరారు. మాజీ
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కడపలో జరగనున్న మహానాడు సభను వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి కోరారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ భాషాతో కలిసి కడప జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ కు వినతిపత్రం సమర్పించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సభలు, సమావేశాలను వాయిదా వేయాలన్నారు.
మహానాడు సందర్భంగా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున వాయిదా వేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం కూడా కరోనా మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. అంతకుముందు విలేకరుల సమావేశం నిర్వహించారు.