News19th Dec 03:40 PMSunil Byrisetty1 min read
పీపీపీపై వైసీపీ నాయకులు మాట్లాడేవన్నీ అబద్ధాలే
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హడావిడి చూస్తుంటే అది రాజకీయ పోరాటంలా లేదు, ఒక భారీ బడ్జెట్ సినిమా షూటింగ్‌లా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీ శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హడావిడి చూస్తుంటే అది రాజకీయ పోరాటంలా లేదు, ఒక భారీ బడ్జెట్ సినిమా షూటింగ్‌లా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీ శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డులు ఇచ్చే వారు జగన్ నటనను చూస్తే, ఆయనకు అంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉంటే ఇవ్వాలని భావిస్తారన్నారు. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు కూడా జగన్ వేస్తున్న వేషాలు, పీపీపీ విధానంపై ఆయన చేస్తున్న "షో" చూసి బిత్తరపోతారని విమర్శించారు. కోటి సంతకాలు అంటూ మూటలు కట్టి, పెద్ద పెద్ద వాహనాల్లో ప్రదర్శిస్తూ జగన్ ఒక పెద్ద నాటకానికి తెరలేపారని ఆరోపించారు. అసలు ఆ మూటల్లో ఉన్నవి సంతకాలేనా? ఏ నియోజకవర్గంలో, ఏ బూత్ లెవల్‌లో సంతకాలు తీసుకున్నారో చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. నియోజకవర్గానికి లక్ష సంతకాలు అంటున్న జగన్, కనీసం ఆయన వెంట తిరిగే కార్యకర్తలతో కూడా సంతకాలు పెట్టించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో పీపీపీ విధానానికి మద్దతుగా సంతకం చేస్తారు.. కానీ ఇక్కడ జగన్ మాత్రం డ్రామాలు ఆడుతారని విమర్శించారు.