Politics19th Mar 12:08 PMSunil Byrisetty1 min read

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ

సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీని వీడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల విజయసాయిరెడ్డి పార్టీని వీడి

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ
సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీని వీడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల విజయసాయిరెడ్డి పార్టీని వీడి వైసీపీకి షాకిచ్చారు. తాజాగా శాసనమండలిలో వైసీపీకి మరో షాక్‌ తగిలింది. వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ ఎమ్మె్ల్సీ అసంతృప్తుల సంఖ్య ఐదుకు చేరినట్లయింది. మరోవైపు వైసీపీ నుంచి రాజీనామా చేసిన స్థానాలన్నీ కూటమి ఖాతాలోకి వెళ్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు 5 ఖాళీ కాగా వాటిలో 3 టీడీపీ, బీజేపీ, జనసేనలు చెరొకటి గెలిచాయి.
MLC Marri Rajasekhar resigned
YS Jaganmohan Reddy
ysrcp
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా
Scroll for the next article