Politics11th Oct 11:50 AMSunil Byrisetty1 min read
వైసీపీకి మిథున్ రెడ్డి మెలిక!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెచ్చిన కొత్త డిమాండ్ ఆ పార్టీకి కొత్త తలనొప్పి తెస్తోంది. కూటమి పార్టీలకు ఎలా ఉన్నప్పటికీ.. వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తుందా అనేది చర్చనీయాంశం
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెచ్చిన కొత్త డిమాండ్ ఆ పార్టీకి కొత్త తలనొప్పి తెస్తోంది. కూటమి పార్టీలకు ఎలా ఉన్నప్పటికీ.. వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో తెరమీదికి వచ్చిన.. నకిలీ మద్యం కుంభకోణం కేసులో .. అనేక మంది టీడీపీ నాయకుల పాత్ర ఉందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఇద్దరు కీలక నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరింత మంది ప్రమేయం ఉందన్న అధికారుల వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉరుములు లేని పిడుగు మాదిరిగా ఎంపీ మిథున్ రెడ్డి నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ.. తంబళ్లపల్లి సహా.. ఎన్టీఆర్, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లోనూ వెలుగు చూసిన.. నకిలీ మద్యం కేసుల వివరాలతో 12 పేజీల నివేదికను కేంద్ర హోం శాఖకు పంపించా రు. తక్షణమే ఈ వ్యవహారంపై సిబీఐ ని వేయాలని.. నిజానిజాలు వెలికి తీయాలని మిథున్ రెడ్డి కోరారు. దీనిపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వైసీపీ మాత్రం ఇరుకునపడింది.