Politics8th Jul 05:17 PMSunil Byrisetty1 min read

జైలులో కాకాణితో కలిసి ఉంటా: ప్రసన్న

నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై YCP నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా చర్చను లేవనెత్తాయి. ప్రసన

జైలులో కాకాణితో కలిసి ఉంటా: ప్రసన్న
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై YCP నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా చర్చను లేవనెత్తాయి. ప్రసన్న మాట్లాడుతూ ప్రశాంతిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 'ప్రశాంతి నాపై కేసులు పెట్టినా, కోర్టుకు వెళ్లినా ఫర్వాలేదు. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటా' అని వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీ నేతలు ఇప్పటికే ప్రసన్నపై దుమ్మెత్తి పోస్తున్నారు.
Andhra Pradesh news
Ap Politics
YCP
Nallapureddy prasanna kumar reddy
Tdp
Kakani govardhan
Arrest
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
Scroll for the next article