Politics5th Jun 06:22 PMSunil Byrisetty1 min read
నెలాఖరులోగా 13 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ రౌండ్ టేబుల్స్
చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైయస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని వైసీపీ స్టేట్
చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైయస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ పోరాటాలకు కొనసాగింపుగా ఈ నెలాఖరులోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో ఏడాదిలో ఏ విధంగా నాశనం చేశారనేది, ఒక్కో రంగాన్ని ఎలా నిర్వీర్యం చేశారనేది చెప్పాలన్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలకు ఆయా రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, సివిల్ సొసైటీ సభ్యులు, రిటైరైన అధికారులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సోషల్ వర్కర్‌లు, రైతుసంఘం నాయకులు, అనుభవమన్న తటస్ధులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేద్దామని సజ్జల పిలుపునిచ్చారు.