News26th Jul 04:19 PMSunil Byrisetty1 min read
వైసీపీ హయాంలో స్కామ్‌లే స్కామ్‌లు
వైసీపీ పాలనంతా అవినీతిమయమని, ఆ అయిదేళ్లలో స్కామ్‌లే స్కామ్‌లని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత విమర్శించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంల
వైసీపీ పాలనంతా అవినీతిమయమని, ఆ అయిదేళ్లలో స్కామ్‌లే స్కామ్‌లని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత విమర్శించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో వెంకుపాలెం నుంచి నరగాయపాలెం వరకు రూ. 4 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును, మార్కాపురం ఆర్ అండ్ బి రోడ్డు నుంచి దొండపాడు వరకు రూ.6.15 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారన్నారు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు.