Politics20th Jun 05:08 PMSunil Byrisetty1 min read
పవన్, బాలకృష్ణ ఏం చేస్తున్నారు?
వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం
వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. "డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు ఎక్కడైనా కనిపించారా?" అని రాసి ఉన్న ప్లకార్డును ఆమె ప్రదర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అంశాలపై గళమెత్తిన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యకు రావడం లేదని శ్యామల విమర్శించారు. ఆయన ఎక్కడున్నారో చెప్పాలంటూ నిలదీశారు. "రాష్ట్రంలో కూటమి నాయకులది గెలుపు కానే కాదు.. అదంతా మాయ" అని ఆమె అన్నారు. హిందూపురంలోని ఒక పోలింగ్ కేంద్రంలో వైసీపీకి కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం బాలకృష్ణ గెలుపు ఎంత కృత్రిమమో తెలియజేస్తోందని ఆమె ఆరోపించారు. "బాలకృష్ణది అసలు గెలుపే కాదు" అని శ్యామల స్పష్టం చేశారు.