Politics12th Mar 02:48 PMSunil Byrisetty1 min read
రాష్ట్రవ్యాప్తంగా యువత పోరు
వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైయస్ఆర్ కడప జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "యువత పోరు(ఫీజు రీయింబర్స్మెంట్)" కడప పార్టీ కార్యాలయం నుంచి విద్యార్
వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైయస్ఆర్ కడప జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "యువత పోరు(ఫీజు రీయింబర్స్మెంట్)" కడప పార్టీ కార్యాలయం నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైయస్ఆర్ సీపీ నాయకులు వేలాదిగా తరలి వెళ్లి కలెక్టర్ గారికి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించాలని వినతి పత్రం అందజేశారు.
మాజీ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా మాట్లాడుతూ 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతకి సాక్ష్యంగా నిలిచిన యువత పోరు అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మోసాలపై నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి భవిష్యత్తుని ఇచ్చారని, అదే విధంగా వైఎస్ జగన్ 90 శాతం మందికి ఫీజు రీయింబర్స్మెంట్, విద్య దీవెన, వసతి దీవెన అందించారని వివరించారు. కూటమి ప్రభుత్వంలో 5వ త్రైమాసికం జరుగుతున్నా ఫీజు రీయింబర్స్మెంట్ ఈ ప్రభుత్వం చెల్లించడం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి రూ. 7200 కోట్లు ఇవ్వాలని, ఫీజులు చెల్లించక పోవడంతో విద్యార్దులు కూలీపనులకు వెళ్ళవలసిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.