Politics25th Mar 02:58 PMSunil Byrisetty1 min read

విశాఖలో మేయర్, కడపలో జడ్పీ చైర్మన్!

ఏపీలో మరోసారి రాజకీయ రచ్చ మొదలైంది. విశాఖలో మేయర్, కడపలో జడ్పీ చైర్మన్ పీఠాల కోసం కసరత్తు మొదలైంది. విశాఖలో మేయర్ హరి వెంకటకుమారికి వ్యతిరేకంగా కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్

విశాఖలో మేయర్, కడపలో జడ్పీ చైర్మన్!
ఏపీలో మరోసారి రాజకీయ రచ్చ మొదలైంది. విశాఖలో మేయర్, కడపలో జడ్పీ చైర్మన్ పీఠాల కోసం కసరత్తు మొదలైంది. విశాఖలో మేయర్ హరి వెంకటకుమారికి వ్యతిరేకంగా కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. ఇప్పుడు విశాఖ నగర పాలక సంస్థలో వైసీపీ బలపరీక్ష తప్పని పరిస్థితి నెలకొంది. మేయర్ స్థానంలో కూర్చోవాలంటే కూటమికి 64 ఓట్లు కావాల్సి వస్తుంది. ప్రస్తుతం విశాఖ నగర పాలక సంస్థలో మరో నలుగురు కార్పొరేటర్లు కూటమి వైపు వస్తే మేయర్ హస్తగతమవుతుంది. మేయర్ స్థానం తమదేనని, అవతలి పక్షం వైపు వెళ్లిన వారు కూడా మళ్లీ తమ గూటికే రాబోతున్నారని డిప్యూటీ మేయర్ శ్రీధర్ ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. మరోవైపు కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. కడప జడ్పీలో మొత్తం 50 స్థానాలు ఉండగా.. వైసీపీ బలం 39గా ఉంది. కడపలో మార్చి 27న జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అందుకోసం వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఇదిలా ఉంటే కడప జడ్పీకి తాము పోటీ పడటం లేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి తేల్చేశారు. దీంతో కడప జడ్పీ వైసీపీకే దక్కనున్నట్లు తెలుస్తోంది.
Kadapa
YCP
ZP Chairman Seat
టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి
Scroll for the next article