Politics22nd Jun 01:45 PMSunil Byrisetty1 min read
వైసీపీ ‘యువత పోరు’ 23న
నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈనెల 23న నిర్వహించే ‘యువత పోరు’ ధర్నాను విజయవంతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు జగన్మో
నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈనెల 23న నిర్వహించే ‘యువత పోరు’ ధర్నాను విజయవంతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కడప జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే ‘యువత పోరు’ పోస్టర్లను ఆవిష్కరించారు. వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గురించే ఆలోచిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు మోసానికి గురవుతున్నారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏడాది గడిచినా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదిగా ఉద్యోగాల కల్పన లేకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 23న ధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు.