Politics21st Oct 02:52 PMSunil Byrisetty1 min read
మేనకోడలి పెళ్లి వేదికకు జగన్ అడ్డు ?
వైఎస్ కుటుంబంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. షర్మిల కుమార్తె పెళ్లిని యలహంక నివాసంలో చేయాలని అనుకుని, నవంబర్ 25న పెళ్లి వేడుక కోపసం అతిథులందరికీ యలహంక అడ్రస్సే ఇచ్చారు. కానీ ఇప్ప
వైఎస్ కుటుంబంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. షర్మిల కుమార్తె పెళ్లిని యలహంక నివాసంలో చేయాలని అనుకుని, నవంబర్ 25న పెళ్లి వేడుక కోపసం అతిథులందరికీ యలహంక అడ్రస్సే ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్ అంగీకరించడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో భాగమైన బెంగళూరులోని యలహంక ప్యాలెస్, 20 ఎకరాల విస్తీర్ణంలో లాన్ని తమ కుటుంబాలకు సమానంగా పంచి ఇవ్వలేదని తల్లి వైఎస్ విజయమ్మ, షర్మిల గతంలోనే ఆరోపించారు. ఒకవేళ ఈ ప్యాలెస్‌ను శుభకార్యానికి వినియోగించుకోవడానికి అనుమతిస్తే, భవిష్యత్తులో అది ఆస్తి హక్కుల క్లెయిమ్‌కు దారితీస్తుందనే లీగల్ సంకేతాల వల్లే జగన్ ఇలా చెప్పారన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి. వైఎస్సార్ ఆశీస్సులతో ఈ వివాహ వేడుకను జరపాలని భావించినప్పటికీ, ఆ అవకాశం లేక వేదికను మార్చాల్సి వస్తోందని అంటున్నారు. దీనిపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.