Entertainment16th Jun 11:50 AMSunil Byrisetty1 min read

క్లాసిక్ లవ్ స్టోరీ కలవనున్న నాగచైతన్య, సమంత?

అక్కినేని నాగ చైతన్య, సమంత కలిసి నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఏమాయ చేశావె’ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది. సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 18న థియేటర్లలో గ్రా

క్లాసిక్ లవ్ స్టోరీ కలవనున్న నాగచైతన్య, సమంత?
అక్కినేని నాగ చైతన్య, సమంత కలిసి నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఏమాయ చేశావె’ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది. సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 18న థియేటర్లలో గ్రాండ్ రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య, సమంత ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కలుస్తారనే చర్చ జరుగుతోంది. నాగచైతన్య, సమంతలు పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయారు. విడాకుల తర్వాత వారు కలవడం గానీ, మాట్లాడుకోవడం గానీ జరగలేదు. తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళను వివాహం చేసుకోగా, సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉన్నట్లుగా పుకార్లు ఉన్నాయి. ఇప్పుడు ‘ఏమాయ చేశావె’ రీ-రిలీజ్ కోసం సమంత, నాగ చైతన్య కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tollywood
Movies
Samantha
naga Chaitanya
Yemaaya chesave movie re-release
Naga Chaitanya Samanatha Meet
ఏం మాయ చేశావే'ను రి రిలీజ్
జులై 18న థియేటర్స్ గ్రాండ్ రీ రిలీజ్
Scroll for the next article