News29th May 02:13 PMSunil Byrisetty1 min read
యోగాంధ్రకు అద్భుత స్పందన!
రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్రకు యోగాభిలాషులు భారీగా నమోదు చేసుకుంటున్నారు. 12 జిల్లాల్లో లక్ష్యానికి మించి నమోదయ్యారు. లక్ష్యానికి చేరువగా మరో 8 జిల్లాలున్నాయి. రిజిస్ట్రేషన్ల
రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్రకు యోగాభిలాషులు భారీగా నమోదు చేసుకుంటున్నారు. 12 జిల్లాల్లో లక్ష్యానికి మించి నమోదయ్యారు.
లక్ష్యానికి చేరువగా మరో 8 జిల్లాలున్నాయి. రిజిస్ట్రేషన్లో విశాఖపట్నం, కోనసీమ, ప్రకాశం జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి.
నెల రోజుల పాటు సాగే యోగాంధ్రాలో మొత్తం 2 కోట్ల మంది నమోదు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో మొదటి వారంలో 26,66,666 రిజిస్ట్రేషన్లు లక్ష్యంగా పెట్టుకోగా ఈ నెల 27నాటికి లక్ష్యాన్ని మించి 28,55,048 మంది పేర్లు నమోదయ్యాయి.