News20th Jun 06:07 PMSunil Byrisetty1 min read

ప్రపంచ రికార్డు సాధించిన ఫ్లోటింగ్ యోగా

భారతీయ వారసత్వ సంపదలో కలికి తురాయి అయిన యోగాను ప్రపంచ దేశాలు అనుకరిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడంతో యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిక

ప్రపంచ రికార్డు సాధించిన ఫ్లోటింగ్ యోగా
భారతీయ వారసత్వ సంపదలో కలికి తురాయి అయిన యోగాను ప్రపంచ దేశాలు అనుకరిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడంతో యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేయాలనే లక్ష్యంతో కృష్ణానదిలో ‘యోగా ఆన్‌ వాటర్‌ క్రాఫ్ట్‌ - ఫ్లోటింగ్‌ యోగా’ ఈవెంట్‌‌ను నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం అభినందనీయమని వరల్డ్‌ రికార్డు యూనియన్‌ ప్రతినిధి ఎలీసా రేనాల్డ్స్‌ అన్నారు. ఇటీవల కృష్ణా నదిలో నిర్వహించిన ‘యోగా ఆన్‌ వాటర్‌ క్రాఫ్ట్‌ - ఫ్లోటింగ్‌ యోగా’ ఈవెంట్‌లో పడవలపై వేలాధిమంది యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సాధించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో వరల్డ్‌ రికార్డు యూనియన్‌ ప్రతినిధి ఫ్రాన్స్‌కు చెందన ఎలీసా రేనాల్డ్స్‌ జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశకు వరల్డ్‌ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని (సర్టిఫికెట్‌) అందజేశారు.
Andhra Pradesh news
Vijayawada
Krishna river
Floating Yoga
Yoga in boats
Collector Lakshmisha
ప్రపంచ రికార్డు సాధించిన ఫ్లోటింగ్ యోగా
Scroll for the next article