News5th Oct 04:13 PMSunil Byrisetty1 min read

దినచర్యలో యోగా ఒక భాగం కావాలి

దేశంలో సమగ్ర విద్యా విధానానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు ఆదర్శంగా నిలవాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, హార్ట్‌ఫుల్‌నెస

దినచర్యలో యోగా ఒక  భాగం కావాలి
దేశంలో సమగ్ర విద్యా విధానానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు ఆదర్శంగా నిలవాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (హైదరాబాద్) సంయుక్త భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ పీఎంశ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు రోజుల యోగా శిక్షణా కార్యక్రమం హైదరాబాదులోని 'కాన్హా శాంతి వనం'లో ప్రారంభమైంది. అక్టోబర్ 7 వరకు ఈ శిక్షణ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 935 పీఎంశ్రీ పాఠశాలల నుండి ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున మొత్తం 1,870 మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ పొందిన ఈ ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో హెడ్‌మాస్టర్ల మార్గదర్శకత్వంలో హార్ట్‌ఫుల్‌నెస్ యోగా అకాడమీ నిపుణుల సహకారంతో యోగాను ప్రతీ విద్యార్థి దినచర్యలో ఒక భాగం చేయాలని అన్నారు. యోగా ద్వారా పిల్లలు శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, మానసిక పటిష్టతలు పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదిగేలా కృషి చేయాలని అన్నారు. శిక్షణ పూర్తయిన ఉపాధ్యాయులకు తమ పాఠశాల 'లీడ్ టీచర్ ఫర్ యోగా'గా ధృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు.
Scroll for the next article