News6th Jun 03:24 PMSunil Byrisetty1 min read
లక్ష్యాన్ని మించి దూసుకుపోతున్న యోగాంధ్ర
ప్రజలలో యోగాను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నెల రోజుల యోగాంధ్ర వివిధ అంశాలకు సంబంధించి లక్ష్యాలను అధిగమిస్తూ దూసుకుపోతోంది. మే 21న ప్రారంభించిన ఈ నమోదు కార్యక్ర
ప్రజలలో యోగాను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నెల రోజుల యోగాంధ్ర వివిధ అంశాలకు సంబంధించి లక్ష్యాలను అధిగమిస్తూ దూసుకుపోతోంది. మే 21న ప్రారంభించిన ఈ నమోదు కార్యక్రమం ద్వారా యోగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి పౌరుల నమోదు 2 కోట్ల లక్ష్యానికి గాను గురువారం నాటికి 1,86,46,143 మంది యోగా ఔత్సాహికులు ఇప్పటికే నమోదు చేసుకున్నారని యోగాంధ్ర పురోగతిని పర్యవేక్షిస్తున్న వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, యోగాంధ్ర రాష్ట్ర సమన్వయకర్త ఎం.టి. కృష్ణబాబు గురువారం రాత్రి మంత్రుల బృందానికి నివేదించారు. నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇది 93 శాతం అని ఆయన వివరించారు. యోగాంధ్ర కార్యక్రమ కార్యకలాపాలకు ఇంకా 2 వారాలు మిగిలి ఉన్నందున తుది నమోదు 2 కోట్ల లక్ష్యాన్ని మించిపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు.