News23rd Jan 02:34 PMSunil Byrisetty1 min read

'నువ్వే నా'.. లోకేష్‌కు బ్రహ్మణి బర్త్ డే విషెస్‌

మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ, కుటుంబ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న లోక

'నువ్వే నా'.. లోకేష్‌కు బ్రహ్మణి బర్త్ డే విషెస్‌
మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ, కుటుంబ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా బ్రహ్మణి భావోద్వేగంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భర్తగా, నాయకుడిగా లోకేష్ చూపిస్తున్న కట్టుబాటు, అంకితభావాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. నువ్వే నా బలం అని పేర్కొంటూ బాధ్యతలతో నడుస్తున్న నీతో కలిసి ప్రయాణించడం గర్వంగా ఉందని బ్రాహ్మణి తెలిపారు. నిరంతర శ్రమతో ప్రజల కోసం పని చేస్తున్న లోకేష్ త్యాగాలను తాను దగ్గర నుంచి చూస్తున్నానని చెప్పారు. ప్రశాంతంగా, స్థిరంగా ముందుకు సాగాలని కోరుకుంటూ తన శుభాకాంక్షలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆమె చేసిన ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా విస్తృతంగా స్పందన పొందింది.
Andhra Pradesh Politics
Nara Lokesh
Brahmani Nara
Birthday Wishes
TDP Leader
Political Family
Emotional Message
Social Media Post
Scroll for the next article