Politics21st Oct 06:06 PMSunil Byrisetty1 min read

మీరు జెన్ జీ ఏంటీ.. కోర్టు సంచలనం

కాక్రోజ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకులు జెన్ జీ కాదంటూ న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. సీజేపీ సహ కన్వీనర్లు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకా వయస్సుపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి

మీరు జెన్ జీ ఏంటీ.. కోర్టు సంచలనం
కాక్రోజ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకులు జెన్ జీ కాదంటూ న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. సీజేపీ సహ కన్వీనర్లు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకా వయస్సుపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారు జెన్‌ జెడ్‌(జీ) తరానికి చెందినవారు కాదని వ్యాఖ్యానించింది. జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనకు సంబంధించిన కేసులో వీరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది అభిక్‌ చిమ్నీ వాదనలు వినిపిస్తూ.. సౌరవ్‌ దాస్‌ వయస్సు 27 ఏళ్లు కాగా, అశుతోష్‌ రాంకా వయస్సు 32 ఏళ్లని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. “అయితే మీరు జెన్‌ జెడ్‌ కాదు. జెన్‌ జెడ్‌ అంటే ఏమిటి?” అని ప్రశ్నించినట్లు బార్‌ అండ్‌ బెంచ్‌ వెబ్సైట్ వెల్లడించింది.
Scroll for the next article