Sports23rd Oct 05:14 PMSunil Byrisetty1 min read

అంద‌రూ బ్యాట్స్‌మెన్ కావ‌డానికే మొగ్గు

నేటి యువత బౌలింగ్ కంటే బ్యాటింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. వచ్చే ప్రపంచకప్‌కు ముందు భారత బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉ

అంద‌రూ బ్యాట్స్‌మెన్ కావ‌డానికే మొగ్గు
నేటి యువత బౌలింగ్ కంటే బ్యాటింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. వచ్చే ప్రపంచకప్‌కు ముందు భారత బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందా అని అడగ్గా, కపిల్ ఇలా అన్నారు, “మనం ఏం చేయగలం? ప్రతి ఒక్కరూ బ్యాట్స్‌మన్‌ అవ్వాలని కోరుకుంటారు. క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌ను అధికారి అంటారు, బౌలర్‌ను కార్మికుడు అంటారు. మనం ఏం చేయగలం? ప్రతి ఒక్కరూ ఏసీ గదిలో పనిచేయాలని కోరుకుంటార”ని చెప్పారు. “ఇది కేవలం ఆరంభం మాత్రమేనని నేను భావిస్తున్నాను. మీరు 1950, 1960, 1980వ దశకాలను చూస్తే, గోల్ఫ్ చాలా ప్రజాదరణ పొందింది, మరియు క్రికెటర్లకు కూడా అది ఒక కష్టతరమైన ప్రయాణం. ఇది కూడా అలాంటి ప్రయాణమేనని నేను అనుకుంటున్నాన’ని పేర్కొన్నారు.
Scroll for the next article