Politics4th Sep 11:32 AMSunil Byrisetty1 min read
విజయవాడ మేయర్ గా యువనేత?
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు బొండా సిద్ధార్థను మేయర్ అభ్యర్థిత్వ రేసులోకి తీసుకొచ్చారు. ఇటీ
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు బొండా సిద్ధార్థను మేయర్ అభ్యర్థిత్వ రేసులోకి తీసుకొచ్చారు. ఇటీవల బొండా సిద్ధార్థ బయోడేటాను స్వయంగా సీఎం చంద్రబాబుకు బొండా ఉమ అందజేశారు. విజయవాడ సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసేందుకు యువ నాయకత్వానికి ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సిద్ధార్థ పేరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బొండా ఉమా కేబినెట్లో బెర్త్ దొరుకుతుందని ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల వల్ల మంత్రి పదవి దక్కకపోవడంతో తన కుమారుడికి మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.