News9th Jun 11:02 AMSunil Byrisetty1 min read

చెత్త బండిలో క్యాష్ కట్టలు!!

చెత్త పడేసేందుకు వెళ్లిన వ్యక్తికి క్యాష్ కట్టలు కనిపించాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లికి చెందిన రామకృష్ణ అనే రైతు ఇటీవల తన బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంకు

చెత్త బండిలో క్యాష్ కట్టలు!!
చెత్త పడేసేందుకు వెళ్లిన వ్యక్తికి క్యాష్ కట్టలు కనిపించాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లికి చెందిన రామకృష్ణ అనే రైతు ఇటీవల తన బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంకులో రూ. 86 వేలు లోన్ తీసుకున్నాడు. ఈ డబ్బును బైక్ ముందు కవర్‌లో పెట్టుకుని వెళ్తుండగా ఓ వ్యక్తి దొంగిలించాడు. రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. అదే సమయంలో శ్రీనివాసపురం ప్రాంతంలో పంచాయతీ చెత్త సేకరణ బండి వెళ్లింది. చెత్త పోస్తున్న రాయదుర్గం సురేష్ అనే వ్యక్తి పాలిథిన్ కవర్‌లో కరెన్సీ నోట్ల కట్టలు ఉండటం గుర్తించాడు. ఓపెన్ చేసి చూడగా.. రూ. 86 వేల నగదు, బ్యాంక్ పాస్‌బుక్, పాన్‌కార్డు ఉన్నాయి. సురేష్ వెంటనే స్థానిక ఎస్సై హనీఫ్‌కు అప్పగించాడు. పాస్‌బుక్ ఆధారంగా డబ్బు రామకృష్ణదేనని నిర్ధారించి అతనికి అప్పగించారు.
Andhra Pradesh news
Nellore district
cash in garbage
Farmer money theft
రాయదుర్గం సురేష్
పాలిథిన్ కవర్‌లో కరెన్సీ నోట్ల కట్టలు
86 వేల నగదు
Scroll for the next article