News25th Jan 04:22 PMSunil Byrisetty1 min read
చింతమనేనిని చూసి నేర్చుకుంటున్న ఎంపీ
ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా ఏలూరు పార్లమెంటు పరిధిలోని కూటమి నాయకులంతా కలిసి పనిచేస్తున్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఆదివారం ఏలూరు జిల్లా దెందులూరు నియ
ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా ఏలూరు పార్లమెంటు పరిధిలోని కూటమి నాయకులంతా కలిసి పనిచేస్తున్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఆదివారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం జాలిపూడి గ్రామంలో వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన, మైక్రో ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సేవ పట్ల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిత్తశుద్ధి చూసి తన వంటి యువ నాయకులు ఎంతో నేర్చుకుంటున్నామన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ ఉపయోగపడే విధంగా, గ్రామాల అభివృద్దే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రూ. 51 లక్షల వ్యయంతో జలజీవన్ మిషన్ కింద జాలిపూడి గ్రామంలో నిర్మించే వాటర్ ట్యాంక్ కి శంకుస్థాపన, 8 లక్షల వ్యయంతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ ప్లాంట్ కు ఎంపీ ప్రారంభోత్సవం చేశారు. 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే వెలమపేట మల్టీ పర్పస్ హాల్ కు ఎంపీ భూమి పూజ నిర్వహించారు.