News4th Jan 04:16 PMSunil Byrisetty1 min read
మీ భూమి–మీ హక్కు.. కొత్త పుస్తకాలు!
“మీ భూమి–మీ హక్కు” నినాదంతో పెరుమాళ్ళపాడు గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ భూమి నాది అనే ధైర్యంతో ప్రతి
“మీ భూమి–మీ హక్కు” నినాదంతో పెరుమాళ్ళపాడు గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ భూమి నాది అనే ధైర్యంతో ప్రతి రైతు హాయిగా నిద్రపోవాలన్నారు. జగన్ బొమ్మ ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు ఇంట్లో ఉంటే అరిష్టమని.. తిరిగి ఇచ్చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రాజముద్రతో, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నూతన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలకు.. తమ ప్రభుత్వం ఇస్తున్న పాసు పుస్తకాలకు ఉన్న తేడాను రైతులకు అర్థమయ్యేలా వివరించారు. ఇప్పుడు ఇస్తున్న పాసు పుస్తకాలను అధికారులు ఇష్టప్రకారం మార్చడానికి కుదరదు.. ఏం మార్పులు చేయాలన్నా డేటా సెంటర్ నుంచే మార్పులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.