News20th Dec 03:58 PMSunil Byrisetty1 min read
వివేకానంద ఆశయాలతో యువత ముందుకు సాగాలి
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ‘యువ కార్యక్రమం’ యువతకు గొప్ప స్ఫూర్తిని అందించిందని యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ‘యువ కార్యక్రమం’ యువతకు గొప్ప స్ఫూర్తిని అందించిందని యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలోని ఆర్&డి ఆడిటోరియంలో నిర్వహించిన యువజన ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్ర యువ సంకల్ప్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన యువతకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదేనని అన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఇవి ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరంగా కొనసాగాలని సూచించారు. యువత తమ చేతుల్లో ఉన్న భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దుకుంటూ, మంచి పనులు చేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు.