Health9th Nov 04:47 PMSunil Byrisetty1 min read

సేవా స్ఫూర్తికి ప్రతీకగా యూత్ టైం బ్యాంక్

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలు విజయవంతంగా 200 రోజులు పూర్తి చేసుకోవడం అభినందనీయమని యూత్ టైం బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహ

సేవా స్ఫూర్తికి ప్రతీకగా యూత్ టైం బ్యాంక్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలు విజయవంతంగా 200 రోజులు పూర్తి చేసుకోవడం అభినందనీయమని యూత్ టైం బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జిల్లా పర్యాటక, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల స‌మ‌న్వ‌య అధికారి డా. కొల్లేటి రమేష్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 17న విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రారంభించిన ఈ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. వివిధ కళాశాలలకు చెందిన జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, అంధులు, నిరక్షరాస్యులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలోనే వినూత్నంగా ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం విజయవాడ జీజీహెచ్‌లో 200 రోజులపాటు నిరంతరంగా కొనసాగడం విశేషమని కలెక్టర్ డా. లక్ష్మీశ అభినందించారు. యూత్ టైం బ్యాంక్ 200వ రోజు సేవల్లో భాగంగా విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేవలందించారు. ఈ సందర్భంగా వాలంటీర్లతో పాటు ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి, కళాశాల ప్రిన్సిపల్‌ను కలెక్టర్ అభినందించారు. యూత్ టైం బ్యాంక్ వాలంటీర్లు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆన్‌లైన్‌లో ఓపీ నమోదు చేయడం, వైద్యులను సంప్రదించడంలో సహకరించడం, వైద్య పరీక్షలు చేయించడం, మందులు పొందడంలో సహాయం వంటి సేవలను అందిస్తున్నారు. యూత్ టైం బ్యాంక్ ద్వారా 5,169 మంది వాలంటీర్లు సేవలందించగా, మొత్తం 20,076 గంటల సమయాన్ని ప్రజాసేవకు వెచ్చించారు. ఈ సేవల ద్వారా 12,338 మంది రోగులకు సహాయం అందించినట్లు డా. రమేష్ వివరించారు.
Scroll for the next article