News16th Apr 09:54 AMSunil Byrisetty1 min read
తిరుమలపై డ్రోన్.. మరోసారి భద్రత ఫెయిల్!
తిరుమల కొండపై విమానాలు, డ్రోన్లకు నిషేధం ఉంది. అయినప్పటికీ డ్రోన్లు ఎగురుతూనే ఉన్నాయి. తాజాగా డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్‌ను విజిలెన్స్ విభాగం అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్ రాష్ట్ర
తిరుమల కొండపై విమానాలు, డ్రోన్లకు నిషేధం ఉంది.
అయినప్పటికీ డ్రోన్లు ఎగురుతూనే ఉన్నాయి.
తాజాగా డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్‌ను విజిలెన్స్ విభాగం అదుపులోకి తీసుకుంది.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా అనే యూట్యూబర్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగురవేసినట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు.
వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని డ్రోన్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే అక్కడి వరకు డ్రోన్‌ను తీసుకెళ్లగలగడం తిరుమల భద్రతా సిబ్బంది వైఫల్యం వల్లేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.