Politics10th Jul 01:05 PMSunil Byrisetty1 min read

జోసెఫ్ అలియాస్ రావణ్.. దెబ్బ మీద దెబ్బ

యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తొలుత నాలుగు కేసుల్లో బెయిల్ లభించడంతో మీసం మెలేసిన రావణ్ ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కపెడుతున్నాడు. తాజాగా అతడిపై

జోసెఫ్ అలియాస్ రావణ్.. దెబ్బ మీద దెబ్బ
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తొలుత నాలుగు కేసుల్లో బెయిల్ లభించడంతో మీసం మెలేసిన రావణ్ ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కపెడుతున్నాడు. తాజాగా అతడిపై నూజివీడులో పోలీసులకు మరో లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సదరు యూట్యూబర్ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు కేసు పెట్టారు. వ్యక్తిగత దూషణలతోపాటు, ప్రభుత్వంపై ద్వేషాన్ని కక్కుతున్నాడని పేర్కొన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. రావణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఉపా కేసులో చిక్కుల్లో ఉన్న జోసెఫ్ కు బెయిల్ దొరికినా మళ్లీ అరెస్ట్ తప్పేలా లేదు.
Andhra Pradesh
Pawan Kalyan
Joseph alias Ravan
YouTuber
Janasena Party
Nuzvid
Police Complaint
Social Media
సోషల్ మీడియా
కేసు
సైబర్ క్రైమ్
ఏపీ రాజకీయాలు
రాజకీయ వివాదం
Scroll for the next article