News28th Sep 03:22 PMSunil Byrisetty1 min read
సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కార్ అణచివేత
గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా పోలీసులను ప్రయోగించి వారి ఆందోళనను అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చం
గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా పోలీసులను ప్రయోగించి వారి ఆందోళనను అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, శాంతియుతంగా నిరసన తెలిపే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సరికాదని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినా పరిష్కారం రాలేదని, అందుకే ఉద్యోగులు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యోగుల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు అరెస్టులు, బైండోవర్‌లు, కేసులు, సస్పెన్షన్లు వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. రేషనలైజేషన్ పేరుతో 30 వేలకు పైగా ఉద్యోగాలను తగ్గించాలని చూస్తున్నారని, పని ఒత్తిడి భరించలేక ఇప్పటికే వంద మందికిపైగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.