Politics7th Sep 04:07 PMSunil Byrisetty1 min read

డీఎస్సీలో భారీ అక్రమాలు

డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం సక్రమంగా నిర్వహిస్తే ఎందుకు సీబీఐ విచారణకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టెట్ రాయకుండానే టీచర్ ఉ

డీఎస్సీలో భారీ అక్రమాలు
డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం సక్రమంగా నిర్వహిస్తే ఎందుకు సీబీఐ విచారణకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టెట్ రాయకుండానే టీచర్ ఉద్యోగం ఇవ్వడమేంటని నిలదీశారు. సాఫ్ట్ బాల్ సంఘం వ్యక్తి భార్యకు ఉద్యోగం రావడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలోనే అక్రమాలన్నీ జరిగాయన్నారు. వాస్తవాలు చెప్తూ తప్పుని ఎత్తిచూపితే సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తున్నవారి గొంతు నొక్కుతున్నారని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
DSC Recruitment
DSC Irregularities
YS Avinash Reddy
Kadapa MP
TET
Teacher Recruitment
CBI Probe
నారా లోకేష్
వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
విద్యాశాఖ
డీఎస్సీ వివాదం
Scroll for the next article