News7th Aug 03:26 PMSunil Byrisetty1 min read

ఎయిడెడ్‌ లెక్చరర్లకు అండ

ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌, అన్‌ఎయిడెడ్‌ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా నిలుస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ భరోసా ఇచ్చారు

ఎయిడెడ్‌ లెక్చరర్లకు అండ
ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌, అన్‌ఎయిడెడ్‌ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా నిలుస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అవసరమైన అన్ని వేదికలపై వారి సమస్యలను ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో వైయస్‌ జగన్‌ను ఏపీ ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజెస్‌/పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కలిసి తమ దీర్ఘకాలిక సమస్యలను వివరించారు. రాష్ట్రంలోని ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో 15 నుంచి 25 సంవత్సరాలుగా అన్‌ఎయిడెడ్‌ పోస్టుల్లో పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికీ వారికి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడం లేదని ప్రతినిధులు చెప్పారు. ప్రభుత్వం 10+2 విధానంలో కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీ చేపట్టే సమయంలో ఇప్పటికే అనేక సంవత్సరాలుగా సేవలందిస్తూ అనుభవం సంపాదించిన పార్ట్‌టైమ్‌, అన్‌ఎయిడెడ్‌ లెక్చరర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
Aided Junior Colleges
Part-Time Lecturers
Unaided Lecturers
బోధనేతర సిబ్బంది
ఆంధ్రప్రదేశ్
విద్య
ఉద్యోగాలు
ఏపీ రాజకీయాలు
గన్నవరం విమానాశ్రయం
వైఎస్సార్సీపీ
Scroll for the next article