Politics24th Sep 03:51 PMSunil Byrisetty1 min read

బలమైన అభ్యర్థులతో ఎన్నికల్లో గెలవాలి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో వైయస్‌.జగన్‌ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ నమన్వయ కర్తలు(రీజినల్

బలమైన అభ్యర్థులతో ఎన్నికల్లో గెలవాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో వైయస్‌.జగన్‌ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ నమన్వయ కర్తలు(రీజినల్‌ కో-ఆర్డినేటర్లు)తో సమావేశమైన మాజీ సీఎం, వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి పార్టీ తరఫున అభ్యర్థులను వేగంగా గుర్తించాలని సూచించారు. బలమైన, మంచి అభ్యర్థులను నిలబెట్టాలని, ఎన్నికలు గట్టిగా చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో మనం తీసుకునే నిర్ణయాలు రేపు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడాలన్నారు. పార్టీలో అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకోండని సూచించారు. రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో వైఫల్యాలను, ప్రజలకు జరిగిన వెన్నుపోట్లను ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రతి గడపవద్దకూ వెళ్లి, మన పాలనలో మంచి, ఈప్రభుత్వంలో వెన్నుపోట్లను వివరించాలని సూచించారు. ఈ రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు పాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టాలను, కష్టాలను వివరించాలని కోరారు.
Scroll for the next article