Politics16th Oct 05:20 PMSunil Byrisetty1 min read
ఎంపీ మిథున్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్
ఎంపీ మిథున్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేశారు. పుంగనూరులో జరిగిన దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్త
ఎంపీ మిథున్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేశారు. పుంగనూరులో జరిగిన దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల పరిపాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత.. ఓటమి భయంతోనే అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌లా మార్చారు, లోక్‌సభలో పార్టీ నాయకుడికే భద్రతలేని పరిస్థితులు చూస్తున్నామని మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో పోలీసులను వాడుకుని అక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్యాయాలను సమర్థంతంగా ఎదుర్కొంటాం.. చట్టపరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు.