Politics23rd Sep 04:48 PMSunil Byrisetty1 min read
స్థానిక ఎన్నికల్లో గట్టిగా నిలబడండి
స్థానిక ఎన్నికల్లో గట్టిగా నిలబడి పోరాడాలని, ప్రజలంతా వైయస్సార్సీపీ వైపే ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పా
స్థానిక ఎన్నికల్లో గట్టిగా నిలబడి పోరాడాలని, ప్రజలంతా వైయస్సార్సీపీ వైపే ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనంతా అరాచకపర్వం అని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు. వేధింపులు కొనసాగుతున్నాయని, వాటన్నింటినీ ప్రజల్లో గట్టిగా ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు వచ్చాకే విశాఖలో సమస్యలు మొదలయ్యాయన్న జగన్, నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, మూడ్రోజులకు ఓసారి నీటి సరఫరా అవుతోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుతో నష్టం జరుగుతోందని, దాదాపు 75 టీఎంసీల నీటి నిల్వ తగ్గుతుందని, ఆ మేరకు గోదావరి నీటిని కోల్పోతున్నామని గుర్తు చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయన్న జగన్, పోలీసులు గతి తప్పి వ్యవహరిస్తున్నారని, దారుణంగా వేధిస్తున్నారని తెలిపారు. డిజిటల్ డైరీతో అన్ని లెక్కలు తేలుస్తామన్న ఆయన, ఇకనైనా వారు పద్ధతి మార్చుకోవాలని కోరారు. లేని పక్షంలో తమ ప్రభుత్వం వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు.