Politics14th Jun 12:22 PMSunil Byrisetty1 min read
దాడి మాపైనే చేసి, ఎదురు కేసులేంటన్న జగన్
దాడి చేసింది కాక, ఎదురు కేసులు పెట్టడమేంటని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు భరోసా కల్పించడానికి తాను పొదిలి వెళితే డైవర్షన్ చేసేందుకు ముఖ్యమంత్రి
దాడి చేసింది కాక, ఎదురు కేసులు పెట్టడమేంటని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు భరోసా కల్పించడానికి తాను పొదిలి వెళితే డైవర్షన్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు. 'నా పర్యటనకు సంఘీభావంగా 40 వేల మంది రైతులు, ప్రజలు వస్తే.. తెలుగుదేశం కార్యకర్తలను ఉసిగొల్పి రాళ్ల దాడి చేయించారు. ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని ప్రజలు సంయమనం పాటించారు. మీవాళ్లు దాడి చేస్తే రైతులను రౌడీలుగా అభివర్ణించి, కేసులు పెట్టడం మీ దిగుజారుడుతనానికి నిదర్శనం' అని జగన్ మండిపడ్డారు.