News1st Jul 04:41 PMSunil Byrisetty1 min read

హైకోర్టులో జగన్‌కు ఊరట

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వృద్ధుడి మృతికి సంబంధించిన కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా రెండు వారాల పాటు స్టే వి

హైకోర్టులో జగన్‌కు ఊరట
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వృద్ధుడి మృతికి సంబంధించిన కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా రెండు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జగన్ తరపు న్యాయవాదులు కేసులో సెక్షన్‌ను బీఎన్‌ఎస్ కింద 105కు మార్చారని, అందువల్ల తదుపరి చర్యలు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచేందుకు తమకు రెండు వారాల సమయం కావాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, రెండు వారాల పాటు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra Pradesh news
Ap politics
Ysrcp
Ys jagan
death case
Ap High court
jagan Gets Relief In Singiah Case
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ కు ఊరట
Scroll for the next article