Politics3rd Jun 05:34 PMSunil Byrisetty1 min read

చంద్రబాబును రోడ్డుపై కొట్టొచ్చా.. జగన్ సంచలనం

ఏపీలో పోలీసుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. పాత కేసులు ఉన్నాయని నడిరోడ్డు మీద కొట్టడం ధర్మమేనా అని ప్రశ్నించారు. అలా

చంద్రబాబును రోడ్డుపై కొట్టొచ్చా.. జగన్ సంచలనం
ఏపీలో పోలీసుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. పాత కేసులు ఉన్నాయని నడిరోడ్డు మీద కొట్టడం ధర్మమేనా అని ప్రశ్నించారు. అలా అయితే 24 కేసులున్న చంద్రబాబును కూడా రోడ్డు మీద కొట్టొచ్చా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల దందాలకు పోలీసులు కలెక్షన్ ఏజెంట్లని, మామూళ్లు వసూలు చేసి వాటాలు పంచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. పోలీస్ వ్యవస్థ వికృత రూపం దాల్చిందంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh news
Ap politics
Tenali Police Incident
john victor incident
Police
ఏపీలో పోలీసుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం
Scroll for the next article