News5th Aug 05:01 PMSunil Byrisetty1 min read

రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు జగన్‌కు ఆహ్వానం

మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 354 వ ఆరాధన మహోత్సవాలకు వైయస్‌ జగన్‌కు ఆహ్వానం పలికారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ను కలిస

రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు జగన్‌కు ఆహ్వానం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 354 వ ఆరాధన మహోత్సవాలకు వైయస్‌ జగన్‌కు ఆహ్వానం పలికారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ను కలిసి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 354 వ ఆరాధన మహోత్సవాలకు మఠం ప్రతినిధులు ఆహ్వానించారు. ఆగష్టు 8 నుంచి 14 వరకు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. రాఘవేంద్రస్వామి మఠం అసిస్టెంట్‌ మేనేజర్‌ నరసింహ స్వామి, ఆలయ సూపరింటెండెంట్‌ అనంత పురాణిక్‌ తదితరులు జగన్‌కు ఆహ్వాన పత్రిక, స్వామివారి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా తప్పనిసరిగా హాజరవుతానని జగన్ వారికి తెలిపారు.
Andhra Pradesh news
Raghavendra Swamy Aradhana 2025
Mantralayam
YS Jagan
Raghavendra Swamy Mutt
Raghavendra Aradhana Invitation
AP Politics
రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు జగన్‌కు ఆహ్వానం
Scroll for the next article