News24th Sep 03:32 PMSunil Byrisetty1 min read

కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్!

డిసెంబర్ 15 కల్లా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తికావాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి నాటికి వారికి ఐడీ కార

కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్!
డిసెంబర్ 15 కల్లా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తికావాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి నాటికి వారికి ఐడీ కార్డులు ఇస్తామన్నారు. రేపు ప్రభుత్వం రాగానే వారికి మంచి చేస్తామని చెప్పారు. విద్యార్థి, మహిళ, యువత, ఎస్సీ, రైతు.. ఇలా ఏడు విభాగాలు గ్రామస్థాయిలో ఏర్పాటు కావాలన్నారు జగన్.. ఇక, రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలబడడం కోసం డిజిటల్ బుక్ తీసుకొచ్చామన్నారు. ఒక పోర్టల్ అయితే, రెండోది ఐవీఆర్ఎస్ విధానం. digitalbook.weysrcp.comలో ఫిర్యాదు చేయవచ్చు.. 040-49171718 నంబర్కు ఐవీఆర్ఎస్కు ఫోన్చేసి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. అన్యాయానికి గురైనవారు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈరోజు వారు రెడ్బుక్ అంటున్నారు. రేపు మనం డిజిటల్ బుక్ ఏమిటన్నది చూపిస్తామని హెచ్చరించారు.
Andhra Pradesh Politics
YSRCP
Jagan
Committees
December 15 Deadline
ID Cards
Sankranti
Students
Women
Youth
SC
Farmers
Village Level Committees
Digital Book
IVRS
Grievance Portal
Red Book
కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్
Scroll for the next article