Politics16th Jul 04:54 PMSunil Byrisetty1 min read
‘జగన్ 2.ఓ సూపర్‌యాప్’ ఆవిష్కరణ
‘జగన్ 2.ఓ సూపర్ యాప్’ను వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆవిష్కరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు అధికారిక ‘జగన్ 2.ఓ సూపర్‌యాప్’ను ఆవిష్కరిస్తున్నామన్నారు. సోషల్ మీడ
‘జగన్ 2.ఓ సూపర్ యాప్’ను వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆవిష్కరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు అధికారిక ‘జగన్ 2.ఓ సూపర్‌యాప్’ను ఆవిష్కరిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కంటెంట్‌ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్ చేయడం, అందుకోసం ఇష్టానుసారం కుట్రలు పన్నడం.. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. అదే జగన్ 2.ఓ సూపర్‌యాప్ అని చెప్పారు. దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చన్నారు. అంతే కాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటాడని, వైసీపీ వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్ చేసే హక్కు కూడా వారికి ఉండదని వివరించారు. పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటాడని చెప్పారు.