News22nd Mar 11:41 AMSunil Byrisetty1 min read
డీలిమిటేషన్పై ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ
డీలిమిటేషన్పై ప్రధాని నరేంద్ర మోడీకి మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని లేఖలో ప్రధానిని కోరారు. 202
డీలిమిటేషన్పై ప్రధాని నరేంద్ర మోడీకి మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని లేఖలో ప్రధానిని కోరారు.
2026లో జరిగే నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందని వివరించారు.
ఎంపీ సీట్లు తగ్గుతాయని దక్షిణాదిలో చర్చ జరుగుతోందన్నారు. గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని, గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే తగ్గిందని వివరించారు. ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఇక్కడ ఎంపీ సీట్లు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనుక డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని వైఎస్ జగన్ లేఖలో కోరారు. మరోవైపు ఇదే అంశంపై తమిళనాడులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల పార్టీల నేతలతో సమావేశం జరుగుతోంది.