Politics12th Aug 03:15 PMSunil Byrisetty1 min read
అందుకే హోదా ఇవ్వట్లేదు: జగన్
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత YS జగన్ భేటీ అయ్యారు. అసెంబ్లీ–మండలి సమావేశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై గతంలోనూ పోరాడాం.. ఇప్పుడు కూడా మరింత గట్టిగా పో
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత YS జగన్ భేటీ అయ్యారు. అసెంబ్లీ–మండలి సమావేశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై గతంలోనూ పోరాడాం.. ఇప్పుడు కూడా మరింత గట్టిగా పోరాడాలని సూచించారు. మండలి సభ్యులంతా సమావేశాలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. YSRCPని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి.. ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు.. తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే సమయం హక్కుగా వస్తుందన్నారు. ఆ హక్కు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకనే.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.